Nirudyoga Bhruthi Scheme Details 2024: AP నిరుద్యోగ భృతి

Advertisement

Nirudyoga Bhruthi Scheme Details 2024: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు తరువాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రకటించారు, ఇందులో ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

AP నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానం, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లై విధానం

AP నిరుద్యోగ భృతి పథకం 2024 వివరాలు:

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మొదటగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే, అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ పథకం వివరాలు చూద్దాం.

Yuva nestham
Yuva nestham

నిరుద్యోగ భృతి అర్హతలు

AP నిరుద్యోగ భృతి పథకం 2024 కి సంబంధించిన అర్హతలు క్రింద ఉన్నాయి:

  • డిప్లొమా/డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు.
  • 20 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  • ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.
  • పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు.
  • తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి.
  • నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
  • కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు.
  • స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు.
  • ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి.

నిరుద్యోగ భృతి పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు

ఈ పథకానికి అవసరమైన పత్రాలు క్రింద ఉన్నాయి:

  • ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
  • బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి.
  • విద్యా సర్టిఫికెట్స్ మరియు మార్క్స్ షీట్స్ కావాలి.
  • ఈమెయిల్ ఐడి కావాలి.
  • పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి.

AP నిరుద్యోగ భృతి పథకం కోసం దరఖాస్తు విధానం

AP నిరుద్యోగ భృతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఉంటుంది. కావున పై తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.

AP నిరుద్యోగ భృతి పథకం అప్లై విధానం

త్వరలో ఈ AP నిరుద్యోగ భృతి పథకం 2024కి సంబంధించిన అప్లై ఫారం ప్రారంభం అవుతుంది.

WhatsApp Group Join Now

Advertisement

en_USEnglish
Scroll to Top