LIVE
AP Volunteers: ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు పై చర్చ

Advertisement

వాలంటీర్ల సేవల ప్రస్తుత పరిస్థితి

ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు పై చర్చ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతోంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని పై కసరత్తు మొదలైంది. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి.

వాలంటీర్ల సేవల ఆవశ్యకత

వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవల పైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తరువాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటం తో పాటుగా పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాడు హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో, వాలంటీర్ల సేవల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనేది కీలకంగా మారుతోంది.

Advertisement

volunteer new update

కొత్త ప్రతిపాదనలు

ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలను తెరమీదకు తీసుకువస్తోంది. వలంటీర్ల ఉద్యోగాలను నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నప్పటికీ, వారి పనితీరులో అనేక మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వలంటీర్లను మూడు సంవత్సరాలకు మించి కొనసాగించకుండా, ప్రతి మూడేళ్లకు కొత్తవారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలో వలంటీర్లకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి, ఇతర ఉద్యోగాలు సంపాదించడానికి మార్గం చూపించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. వలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పులు, ప్రజల సలహాలు, సూచనలు సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

వాలంటీర్ల పేరు మార్పు

వలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్‌, వార్డు సేవక్‌గా మార్చాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలినే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వలంటీర్ల వేతనం రూ.పది వేలకు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్లు ఉండగా… ఇకపై ప్రతి 100 ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవల పైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది.

Advertisement

en_USEnglish
Scroll to Top